దళపతి 69 కోసం విజయ్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..?

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తాజా చిత్రం గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి

Update: 2024-06-22 03:31 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తాజా చిత్రం గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. ఇటీవ‌లే పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన వేసిన విజ‌య్ ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ‘ది గోట్’ అనే మూవీని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది విజయ్‌కి 69వ సినిమా. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించి దళపతి విజయ్ పారితోషకం గురించి తమిళ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

విజయ్ తన తాజా చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాజా రూమర్ల ప్రకారం, విజయ్ దళపతి 69 కోసం రూ. 275 కోట్లు తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా విజయ్ సరికొత్త రికార్డు నెలకొల్పడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టును ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల దానయ్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.. సన్ పిక్చర్స్ అస్తానా నిర్మాణ బాధ్యతలను స్వీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది


Similar News