సింగర్ సునీత తన మొదటి భర్తతో విడిపోవడానికి కారణం ఇదే..
తెలుగు స్టార్ సింగర్ సునీత గురించి పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: తెలుగు స్టార్ సింగర్ సునీత గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్లే బ్యాక్ సింగర్స్‌కూ అంతే క్రేజ్ ఉంటుంది. అలా ఇప్పటి వరకు వేల పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది సునీత. ఇక సునీత కెరీర్ విషయం పక్కన పెడితే గత రెండు సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ టైమ్‌లో ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయని ఆమె.. ప్రస్తుతం తన జీవితాన్ని అందంగా మలుచుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మొదటి భర్త కిరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీత అసలు ఎందుకు విడిపోయిందనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంట్లో వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న కిరణ్-సునీత మధ్య పిల్లలు పుట్టిన తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో పిల్లల భవిష్యత్తు బాగుండాలని విడాకులు ఇచ్చి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది సునీత.