Committee Kurrallu: నిహారిక నిర్మాతగా సక్సెస్ అయిందా.. ‘కమిటీ కుర్రాళ్ల’పై నెట్టింట టాక్ ఇదే!
నూతన నటీనటులతో నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రాళ్లు’.
అయితే స్టోరీ కొత్తది కాకపోయినా.. ఇలాంటి చిత్రంలో ఏ మాత్రం స్క్రీన్‌ప్లేలో మ్యాజిక్ చూపించినా.. ఎమోషనల్‌గా ఆ క్యారెక్టర్స్‌తో కనెక్ట్ చేయించినా సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది. అయితే కమిటీ కుర్రాళ్లు సినిమాలో జాతర హడవుడి.. స్నేహితుల మధ్య కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు.. ఇలా అన్ని రాసుకున్నారు. కాకపోతే ఎమోషన్ అనేది పాత్రల మధ్య క్యారీ కాకపోవడం వల్ల సినిమా అంతా రక్తికట్టించలేకపోయింది. తొలిభాగం సరదా సరదాగా గడిచిపోయినా.. సెకండాఫ్ మాత్రం సాగతీత సన్నివేశాలతో కాస్త బోర్ కొట్టిస్తుంది.
ఒకే సినిమాలో స్నేహాం, ఎన్నికలు, రిజర్వేషన్స్ ఇలా మూడు పాయింట్స్ టచ్ చేయాలి అని చూసిన దర్శకుడు దేనికి సరైన న్యాయం చేయలేదు అనిపిస్తుందని టాక్. ముఖ్యంగా పతాక సన్నివేశాలు పెద్దగా ఆసక్తికరంగా కనిపించలేదట. సినిమా ఇదే పెద్ద మైనస్ అని టాక్. అసలు సరైన ముగింపు లేకుండా సినిమాను ఎండ్ చేయడం టోటల్‌గా సినిమా కమిట్‌మెంట్‌ను దెబ్బతీసిందని ప్రేక్షకుల ఒపీనియన్. ఈ కథను దర్శకుడు మరింత ఎమోషనల్ క్యారీ చేయడంతో పాటు, కీలక సన్నివేశాలు మరింత బలంగా రాసుకుని వుంటే తప్పకుండా కమిట్‌కుర్రాళ్లకు అందరూ కంగ్రాట్స్ చెప్పేవాళ్లు..! అంటూ కామంట్స్ వినిపిస్తున్నాయి. కాగా.. మొదటిసారి నిర్మాతగా వ్యవహరించిన నిహారిక సక్సెస్ అయ్యిందో లేదో? తెలియాల్సి ఉంది.