సమంత విడాకులకు మద్యం మత్తే కారణమా..? ఆ రాత్రి అలా జరగకపోతే.. ఫిల్మ్ నగర్ టాక్ ఇదే..?
టాలీవుడ్లో స్టార్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న వారిలో సమంత-నాగచైతన్య ఒకరు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో స్టార్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న వారిలో సమంత-నాగచైతన్య ఒకరు. వీరిద్దరు ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేయకుండానే డివోర్స్ తీసుకున్నారు. వీరు డివోర్స్ తీసుకోవడానికి పలు రకాల కారణాలంటూ చాలా రూమర్స్ వచ్చాయి. కానీ సామ్-చైతూ ఏ రీజన్ వల్ల విడాకులు తీసుకున్నారో ఇప్పటివరకు నెటిజన్లకు క్లారిటీ లేదు. తాజాగా వీరిద్దరు విడిపోవడానికి ఇదే ముఖ్య కారణమంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతుంది. సమంత ఓ ఫంక్షన్లో ఫుల్‌గా తాగి ఇంటికొచ్చిందట.
అప్పటికే ఫుల్ ఫైర్ మీదున్న చైతన్యతో కంట్రోల్ తప్పి మాట్లాడిందట. మద్యం మత్తులో పలు విషయాలు బయట పెట్టేసిందని, హద్దులు మీరి.. టంగ్ స్లిప్ అయిందని .. ఆ కారణంగానే హర్ట్ అయిన చైతూ డివోర్స్‌కు అప్లై చేద్దామంటూ ప్రపోజల్ తీసుకొచ్చారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ నైట్ వాళ్లు కాంప్రమైజ్ అయ్యి ఉండి ఉంటే.. ఒకరికి ఒకరు సారీ చెప్పి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదని, చక్కగా పిల్లల్ని ఎత్తుకొని లైఫ్‌ను ఎంజాయ్ చేసే వాళ్ళని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఈగో కారణంగానే ఈ స్టార్ జంట విడిపోవడం చాలా బాధాకరమని నెట్టింట చర్చించుకుంటున్నారు.
Read More: ఆ హీరోతో పనిచేయడం నా అదృష్టమే.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్