ఆదిపురుష్-రామాయణం ఒక్కటేనా? మరి రాముడు రాఘవుడు ఎలా అయ్యాడు..? (వీడియో)
ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో.. మరో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే డైరెక్టర్ ఓంరౌంత్ అందరూ అనుకున్నట్లు ఈ మూవీ స్టోరీ ఉండదని.. ఇందులో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ పోషించే పాత్రలు అవి కాదంటూ కుండబద్దలు కొట్టాడు. ఆయన చెప్పిన దానికి ఓ కారణం ఉంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు రాముడు కాదని, ఆయన రాఘవ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే సీత పాత్ర పేరు కూడా జానకీ అని, రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ పేరు లంకేష్ అని, హనుంతుడి పేరు బజ్ రంగ్ అని ఇలా రామాయణంలోని పేర్లు కాకుండా కొత్త పేర్లను వాడటంవల్ల ఆ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అలా మార్చారు.
అయితే ఇన్ని కోట్లు పెట్టి సినిమా చేశారంటే ఇప్పటివరకూ మనం చూసిన రామాయణంలా కాకుండా కొత్తగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమైంది. రాముడికి మీసాలు ఉండటం, రావణుడు లుక్ భిన్నంగా ఉండటం, పాత్రల పేర్లు కొంత వైవిధ్యంగా ఉండటం సినిమాలో ఏదో ఉంది చూడాలి అనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. అసలు ఈ ఆదిపురుష్ సినిమాలో స్టోరీ ఎక్కడినుంచి మొదలవుతుందనే ప్రశ్న అందరిలో కలుగుతుంది. రాముడు పుట్టుకనుంచే మొదలవుతుందా లేక సీతని వివాహమాడిన తర్వాత స్టార్ట్ అవుతుందా అని కొంత సస్పెన్స్‌గా ఉంది. ట్రైలర్ చూస్తే మాత్రం రాముడిపై హనుమంతుడికి ఉన్న అనంతమైన భక్తిని, అలాగే సీతపై రాముడికి ఉన్న అపారమైన ప్రేమని చూపించారు.
ఇక రాముడికి రావణుడికి జరిగే యుద్ధం ఎలా ఉండబోతుంది అన్నదాన్ని కూడా అద్భుతంగా చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై రఘురాముడిగా ప్రభాస్ చేసే యుద్ధం వానర సైన్యాన్ని వెంట పెట్టుకొని అసురాధిపతి లంకేష్ రావణ్‌తో చేసే పోరాటాలు ఆదిపురుష్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి. మరి ఒకప్పుడు తండ్రిమాటకి కట్టుబడి ఉండే రాముడిని మనం చూశాము. రాజ్య పాలన అంటే రాముడి తర్వాతే అని విన్నాం.. చూడటానికి సౌమ్యంగా, సున్నితంగా కనిపించే రాముడు మరి ఈ సినిమాలో గంభీరంగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఇలా రాముడు మనికు చిన్నప్పటినుంచి సినిమాలో చూస్తున్నట్లు కనిపిచంబోతున్నాడా లేక విభిన్న యాంగిల్స్‌లో రాముడిని చూడబోతున్నామా అనేది కొంత సస్పెన్స్‌గా ఉంది. అయితే రాముడికి కోరమీసాలు ఉంటాయా అని కొంత మంది ఆశ్చర్యపోతున్నారు. ఇక రావణుడిని కూడా చాలా కొత్తగా చూపించారు. రావణుడు అంటే పొడవాటి జుట్టు, గంభీరమైన లుక్స్, భారీ ఆకారం ఉన్నట్లు చూశాం. కానీ సైఫ్‌ని చూడగానే ఇదేంటి రావణుడు ఇలా ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పటి వరకూ చూసిన విధంగా కాకుండా విభిన్నమైన లుక్స్‌లో రామాయణ పాత్రల్ని చూడబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కచ్చితంగా ప్రభాస్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా ఆదిపురుష్ మారుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే రెండు వేల కోట్ల కలెక్షన్స్ కూడా ఈ చిత్రం అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూవీ రిలీజ్‌కు ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి హై ఎక్స్ పెక్టేషన్స్‌తో ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న జానకి రాఘవుల కథ ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.