'నేను కాదు నువ్వే'.. సమంత- చిన్మయిల మధ్య ఆసక్తికర సంభాషణ!
స్టార్ నటి సమంత, సింగర్ చిన్మయి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఇటీవలే మయోసైటీస్ నుంచి కోలుకుంటున్న సామ్ తన అప్ కమింగ్ మూవీ 'సిటాడెల్' పనుల్లో నిమగ్నమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే
దిశ, సినిమా : స్టార్ నటి సమంత, సింగర్ చిన్మయి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఇటీవలే మయోసైటీస్ నుంచి కోలుకుంటున్న సామ్ తన అప్ కమింగ్ మూవీ 'సిటాడెల్' పనుల్లో నిమగ్నమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. కాగా తమ సిరీస్‌లోకి సామ్ ఎంట్రీని స్వాగతిస్తూ హాలీవుడ్ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. దీంతో నటుడు, చిన్మయి భర్త రాహుల్ స్పందిస్తూ.. 'సామ్ ప్రయాణం ఎలా మొదలైందో నాకింకా గుర్తుంది. హాలీవుడ్ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్.. సామ్‌ను తమ ప్రాజెక్టులోకి ఆహ్వానించడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది' అంటూ రాసుకొచ్చాడు.
అయితే వెంటనే దీనిపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన చిన్మయి.. 'సమంత ఓ క్వీన్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం' అంటూ ప్రశంసలు కురిపించింది. అలాగే ఈ ట్వీట్స్‌పై రియాక్ట్ అయిన సామ్.. 'నేను కాదు నువ్వే చిన్మయి. రాహుల్ లాంటి గొప్ప ఫ్రెండ్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం' అంటూ పొగిడేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.