లావణ్యతో నా పెళ్లి రెండు సార్లు క్యాన్సల్ అయ్యింది.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిసిస్తున్న స్టార్ కపుల్ పేరు లావణ్య, వరుణ్. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మిస్టర్ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, ఆ మూవీతోనే

Update: 2024-02-27 14:46 GMT

దిశ, సినిమా : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిసిస్తున్న స్టార్ కపుల్ పేరు లావణ్య, వరుణ్. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మిస్టర్ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, ఆ మూవీతోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వారు ప్రేమించుకొని, తర్వాత పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లిచేసుకున్నారు. ఇక వీరి పెళ్లైనప్పటి నుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీరి ప్రేమ, పెళ్లికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే నెటిజన్స్ టక్కున పట్టేసుకొని నిమిషాల్లో తెగ వైరల్ చేస్తున్నారు.

ఇక తాజాగా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్2లో పాల్గొన్న వరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నేను సినిమాల విషయంలో చాలా స్ట్రిట్‌గా ఉంటాను.సినిమా షూటింగ్ ఐపోయే వరకు పర్సనల్ విషయాలపై ఫోకస్ చేయను, ముఖ్యంగా ఈ సినిమా కోసం లావణ్యతో నా పెళ్లి రెండు సార్లు వాయిదా వేసుకున్నానని పేర్కొన్నారు.


Similar News