జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పనున్న ఇంద్రజ..స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న జడ్జి (వీడియో)
బుల్లితెరపై ప్రచారం అవుతున్న షోలలో జబర్దస్త్ ఒకటి.
దిశ, సినిమా: బుల్లితెరపై ప్రచారం అవుతున్న షోలలో జబర్దస్త్ ఒకటి. ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు జీవితాలను ఇచ్చిన ఈ షో.. గతంతో పోల్చుకుంటే ఈ మధ్యలో కాస్త క్రేజ్ తగ్గింది. యాంకర్లు మారడం, కంటెస్టెంట్స్ మానెయ్యడం, అలాగే జడ్జిలు మారడం ఇవన్ని జబర్దస్త్‌కు మైనస్ అయినట్లు చెప్పుకోవచ్చు. అయితే.. ఈ మధ్యలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది ఈ షో. రోజా తర్వాత జడ్జిగా ఇంద్రజ రావడంతో జబర్దస్త్ స్టేజ్‌పై కొత్త రంగులు వచ్చినట్లు అయింది. ఇంద్రజ స్మైల్, కామెడీ టైమింగ్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పుడైతే చాలా మంది సీనియర్ నటి ఇంద్రజ కోసమే ఈ షో చూస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె వళ్లే జబర్దస్త్ రేటింగ్ కూడా పెరిగిందని టాక్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇంద్రజ కూడా జబర్దస్త్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి వారం లాగే ఈ వీక్ కూడా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలాగే.. స్టార్టింగ్‌లో కంటెస్టెంట్స్ వాళ్ల కామెడీ పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక ఎపిసోడ్ చివరిలో.. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను కొన్ని రోజులు జబర్దస్త్‌కి గ్యాప్ ఇస్తున్నాను అంటూ చెప్తూనే కన్నీళ్లు పెట్లుకున్నారు. దీంతో స్టేజ్‌పై ఉన్నవాళ్లు కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఇంద్రజ లేకపోతే మేము ఈ షో చూడము’ అని ‘ఇంద్రజ లేకపోతే జబర్దస్త్ రేటింగ్ మళ్లీ పడిపోతుంది కన్ఫార్మ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
Read More...