ట్రెండింగ్‌లో ‘పైసా రే పైసా’ సాంగ్..
ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’.
దిశ, సినిమా : ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’. కాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘పైసా రే పైసా’ నెట్టింట రచ్చ చేస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం వహించిన ఈ పాటకు అనూప్, శ్రీనివాస్ చింతల సాహిత్యం అందించగా.. మంచి బీట్‌తో ఉన్న సాంగ్‌కు బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేశాడు. ‘డబ్బు చుట్టు లోకం తిరుగుతుంది.. నీతో పట్టి చాకిరి చేస్తుంది... రౌండ్ రౌండ్... గోల్ తిప్పుతుంది.. నిన్ను మత్తులో ముంచేస్తుంది..’ అంటూ సాగే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read..