అర్హ పలికే తెలుగు పదాలకు గుణశేఖర్ ఫిదా.. బన్నీ-స్నేహలపై ప్రశంసలు
స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’.
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా రంగ ప్రవేశం చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్.. అర్హ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ‘అర్హ పాపలో ఆకట్టుకున్న విషయం ఏమిటంటే ఆమె ఒక్క ఇంగ్లీష్ పదం కూడా మాట్లాడలేదు.
మొత్తం స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతుంది. ఆమె మాట్లాడిని కొన్ని పదాలు మాకు అర్థం కాలేదు. అయితే బన్నీ నాకు కాల్ చేసి ‘సార్ మా పాప మీ సెట్కొచ్చి పాడైపోయింది. ఇంగ్లీష్ పదాలు కట్, స్టార్ట్ కెమెరా.. ఇలాంటి పదాలు వాడుతుంది’ అని కంప్లైంట్ చేశాడు. నిజంగా మాతృభాష నేర్పినందుకు స్నేహ రెడ్డి, బన్నీని అభినందించాలి’ అని చెప్పుకొచ్చాడు.
Read More: ‘రానా నాయుడు’ సీజన్ 2 వచ్చేస్తుంది!