ఓటీటీలో తెలుగు సినిమాల కన్నా.. ఆ సినిమాలే ట్రెండ్ అవుతున్నాయి.. కారణం ఇదేనా

ఒకప్పుడు ఒక సినిమా చూడటానికి పండుగలు వరకు వేచి చూసేవాళ్ళు..

Update: 2024-06-23 03:29 GMT

దిశ, సినిమా: ఒకప్పుడు ఒక సినిమా చూడటానికి పండుగలు వరకు వేచి చూసేవాళ్ళు.. కానీ, ఇప్పుడు రోజులు మొత్తం మారిపోయాయి. సినిమా విడుదలైన కొద్దీ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. ఇక, థియేటర్లకి వెళ్లి చూడటమే మానేశారు. ఓటీటీలో విడుదలైన మొదటి రోజు నుంచే సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. కానీ, మన తెలుగు సినిమాల కన్నా.. ఇతర భాషాల సినిమాలే .. ఓటీటీలో బాగా హాల్చల్ చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో OTTలో చాలా ఇతర భాషా చిత్రాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా మలయాళ సినిమాలు అయితే, OTTలో రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి.

తెలుగు సినిమా కథల కన్నా.. మలయాళం, తమిళ, కన్నడ, హిందీ సినిమా కథలనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. తెలుగు డైరెక్టర్స్ కొత్త కథలతో తీయడమే మానేశారు.. డబ్బింగ్ సినిమాలనే నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు. ఇతర భాష సినిమాల్లో.. వచ్చిన కథ మళ్లీ తీయడానికి అసలు ఇష్ట పడరు. కానీ, తెలుగులో అలా కాదు.. అది హిట్ అయినా.. హిట్ అవ్వకపోయినా డబ్బులు పెట్టి మరి తీస్తారు.. అయినా ప్రయోజనం ఉండటం లేదు. ఇప్పటికైనా మారండి అంటూ.. నెటిజెన్స్ మండిపడుతున్నారు.      


Similar News