ఆ సీన్ కోసం 32 రోజులు స్నానం చేయలేదు: రితికా సింగ్
‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’.
దిశ, సినిమా: ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషించిన మూవీ మార్చి 3న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రితిక మాట్లాడుతూ.. ‘ఇది చాలా సీరియస్, కంప్లీట్ రా ఫిల్మ్. డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. అందరూ తప్పకుండా చూడాలి’ అని కోరింది. అలాగే 32 రోజుల పాటు తలస్నానం చేయకుండా ఒకే డ్రెస్‌తో ఉన్న రితిక అంకితభావం నచ్చిందన్న దర్శకనిర్మాతలు ఈ చిత్రం ఆమెకు మరో జాతీయ అవార్డ్ తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి : Rithika Singh: ఆ ఫొటోలు చూస్తే మా పేరెంట్స్ గుండె బద్ధలవుతుందంటున్న రితికా!