హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్.. ఫిల్మ్ చాంబర్ కఠిన నిర్ణయం
దిశ, సినిమా: హీరోహీరోయిన్లు, దర్శకుల భారీ రెమ్యునరేషన్స్కు బ్రేక్ వేసింది ఫిల్మ్ ఛాంబర్. ఒక్క సినిమాకు రూ. 60 కోట్ల నుంచి రూ.100కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న క్రమంలో..Latest Telugu News
దిశ, సినిమా: హీరోహీరోయిన్లు, దర్శకుల భారీ రెమ్యునరేషన్స్కు బ్రేక్ వేసింది ఫిల్మ్ ఛాంబర్. ఒక్క సినిమాకు రూ. 60 కోట్ల నుంచి రూ.100కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న క్రమంలో.. ఈ నెల 10 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఇప్పటి వరకు స్టార్ హీరో, హీరోయిన్స్ సహాయక సిబ్బందికి సంబంధించిన పూర్తి ఖర్చులు నిర్వాతలే చెల్లిస్తూ వచ్చారు. ట్రాన్స్పోర్ట్, పర్సనల్ స్టాఫ్, అకామిడేషన్, ఫుడ్‌కు సంబంధించిన అన్ని ఖర్చులు చూసుకున్నారు. కానీ ఇకపై ఆ ఖర్చులన్నీ హీరో హీరోయిన్లే చూసుకోవాలని రూల్స్ జారీ అయ్యాయి.
సినిమాలో పాత్రకు తగినట్లుగా పారితోషికాన్ని ఫిక్స్ చేయాలని, సినిమా ప్రారంభానికి ముందుగానే రెమ్యునరేషన్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవాలి అని సూచించింది. అలాగే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్.. ఓటీటీ రిలీజ్‌కు మధ్య కచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. ఓటీటీ కారణంగా ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.