నన్ను క్షమించండి.. ఆ సినిమా నా వల్ల ఫ్లాప్‌ కాలేదు దయచేసి ట్రోల్స్ చేయకండి.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

యంగ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు తెలుగులో నాగచైతన్య ధూత వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-08-07 13:30 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు తెలుగులో నాగచైతన్య ధూత వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు-2 సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీ కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, కాజల్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన.. ఈ చిత్రం జూలై 12 విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ప్రియా వల్లనే మూవీ ఫ్లాప్ అయిందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా తనపై వస్తున్న విమర్శలపై స్పందించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ ఇటీవల వచ్చిన ఇండియన్-2లో లెజెండ్స్‌తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇండియన్-2 బాగోలేదని నన్ను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ రోజు నాకు భారతీయుడు-2 కథలో నటించే అవకాశం వచ్చింది. అది ఫ్లాప్ అవుతుందని తెలిసినా నేను సినిమాలో నటించడానికి సిద్ధం అవుతా.

అందుకే ఆ అవకాశాన్ని వదులుకోలేదు. నేను నటించిన సినిమాలు హిట్ అయినప్పుడు ఎవరూ నన్ను మెచ్చుకోలేదు. కానీ ఫ్లాప్ అయిందని ట్రోల్స్ చేయడం బాధ కలిగిస్తుంది. సినిమా ఫ్లాప్ అవడం నా ఒక్కదాని బాధ్యత కాదని తెలుసుకోండి. ఇండియన్-2 సినిమాలో నా నటన నిరాశ పరిస్తే నన్ను క్షమించండి. అంతేగాని దయచేసి నన్ను ట్రోల్స్ చేయకండి బాధగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియా భవానీ డెమొంటే కాలనీ-2లో హీరోయిన్‌గా చేస్తుంది. సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ తొందరలో విడుదల కాబోతుంది.

Tags:    

Similar News