ఏం చేయాలన్నా ఇబ్బందిగా ఉందంటూ ఇలియానా ఎమోషనల్ పోస్ట్
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణిచింది. ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది
దిశ, వెబ్ డెస్క్: గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణిచింది. ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే పెళ్లి కాకుండానే ఇటీవల తాను ప్రెగ్నెంట్ అంటూ ఓ పోస్ట్ చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, తన బిడ్డకు కాబోయే తండ్రి గురించి మాత్రం చెప్పలేదు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన భర్త ముఖం కనిపించకుండా ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ జాగ్రత్త పడుతుంది.
తాజాగా, ఇలియానా తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ తొమ్మిదో నెల కావడంతో ఏ పనులు చేయలేకపోతున్నాను. నీరసం బాధిస్తుంది. నెలలు నిండాక నడవడం కూడా కష్టమవుతుంది. అందుకే మాతృత్వం గొప్పది అంటారు. లోపల బిడ్డ తంతున్నాడు’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆమె ఫొటోను కూడా షేర్ చేసింది. అందులో గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కాగా, ఇలియానా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్‌తో సహజీవనం చేస్తున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ విషయం తెలిసిన వారంతా పుట్టబోయే బిడ్డకు తండ్రి అతనేనని అందరూ అనుకుంటున్నారు.
Also Read: సెక్స్ కోసం దుబాయ్ వెళ్లిన రిషబ్-ఊర్వశి.. మళ్లీ అదే హోటల్