అలాంటి ఊహల్లోనే ఉంటే.. వాస్తవాలు ఎప్పటికీ అర్థం కావు : Shraddha Kapoor

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఆశికీ-2’ మూవీ తో

Update: 2024-02-04 04:32 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఆశికీ-2’ మూవీ తో తన అందం నటనతో అందరినీ కట్టిపడేసింది ఈ చిన్నది. దీంతో వరుస అవకాశాలు అందుకుంటు ప్రభాస్ కి జోడిగా ‘సాహో’తో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా అలరించింది శ్రద్ధా. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.. నటి మాట్లాడుతూ ‘ నేను సినిమాల్లోకి వస్తానంటే నాన్న (శక్తికపూర్‌) ఎంతో ప్రోత్సహించారు. అంతే కాదు ఒక యాక్టర్‌గా ఎలా ఉండాలో చెప్పారు. కానీ సినిమా కథ వినడం, ఓకే చెప్పడం ఎలా ఇలాంటివి ఎన్నడూ చేప్పలేదు. ఎందుకంటే నేను సరైన నిర్ణయం తీసుకోగలనని ఆయన నమ్మకం.

ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నేను ఎంపిక చేసుకున్నవే. ఇక గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ పాటించక తప్పడం లేదు. కాలేజ్‌ డేస్‌లో నన్ను చూస్తే ఈ అమ్మాయికి అసలు ఫ్యాషన్‌కు స్పెల్లింగ్‌ అయిన వచ్చా అనుకునే వాళ్లు. అంత సింపుల్ గా అమ్మమ్మ బంగారు గాజులు వేసుకుని వేలే దాని అంతా వింతగా చూసేవాళ్లు. కానీ ఆ గాజులతో నాకున్న అనుబంధం అలాంటిది. అందుకే తీయాలనే ఆలోచన కూడా నాకు వచ్చేదికాదు. చాలామంది లైఫ్ ఆడుతూపాడుతూ సాగిపోవాలని కోరుకుంటారు తప్పులేదు..! జీవితంలో ఫాంటసీలు ఉండాలి కానీ, ఫాంటసీలే జీవితం కావొద్దు. ఎందుకంటే పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవు. ఊహల్లోనే విహరిస్తుంటే.. వాస్తవం ఏంటో ఎప్పటికీ అర్థం కాదు’ అని తెలిపింది శ్రద్ధ. ప్రజంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News