దేవర సినిమాతో అల్లు అర్జున్‌కు ఉన్న సంబంధం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా దేవర. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో
దిశ, సినిమా : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా దేవర. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా చేస్తుంది. దీంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా కష్టం పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? మొదటగా ఈ మూవీని దర్శకుడు అల్లుఅర్జున్‌తో చేయాలనుకున్నాడంట, కథను కూడా చెప్పాడంట. కానీ దీని బన్నీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా కొన్ని సంవత్సరాల పాటు తప్పించుకొని తిరగడంతో, డైరెక్టర్‌కు విసుగువచ్చి, కథలో మరిన్ని మార్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్‌కు కథను చెప్పాడంట. దీంతో ఆయన కథ నచ్చి ఒకే చేసినట్లు సమాచారం. ఇక అక్టోబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
Read More..
ఆ స్టార్ డైరెక్టర్ ను రెండు సార్లు రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. !