Parvathy Thiruvothu : సినిమాల్లోకి రాకపోయింటే రోడ్డు పక్కన ఆ పనే చేసే దాన్ని .. ' తంగలాన్ ' హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘తంగలాన్’.

Update: 2024-07-25 11:01 GMT

దిశ, సినిమా: చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘తంగలాన్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఎలా అయినా హిట్ కొట్టాలని చిత్ర టీం భావిస్తుంది.

‘కబాలి’ తో పెద్ద హిట్ కొట్టిన ఫేమ్ పా.రంజిత్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీలో మాళవిక మోహన్, పార్వతి తిరువొతూ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయినా సినిమా ట్రైలర్ మంచి బజ్ క్రియోట్ చేయడమే ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగినా ప్రెస్ మీట్ లో తంగలాన్ మూవీ హీరోయిన్లు పాల్గొన్నారు.

" నటి కాకపోయి ఉంటే మీరు ఏమి చెసేవారని ’ పార్వతిని అడగగా ఆమె ఇలా జవాబు చెప్పింది నటిగా నాకు అవకాశం రాకపోయి ఉంటే రోడ్డు పక్కన టీ షాపు పెట్టేదాన్ని.. మనకి బాగా వచ్చిన పనిని గౌరవించి చేయడంలో తప్పు లేదు. నేను చిన్నప్పటి నుంచి టీ బాగా పెడతాను. అప్పడప్పుడు టీ షాపు ఆలోచన వస్తూనే ఉంటుంది ఇక సినిమా విషయానికొస్తే తంగలాన్‌ లో గంగమ్మ అనే పాత్రలో చేసా " అని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News