మోక్షజ్ఞలో అవి లేకపోతే హీరోగా పనికిరానట్లేనా?
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాదే ఎంట్రీ ఇస్తాడని నెట్టింట వార్తలు వినిపించాయి. తండ్రీకొడుకుల దర్శకత్వంలో ‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ సినిమాతో తెరపై మెరవనున్నారని టాక్ వచ్చింది. కానీ బాలయ్య జాతకాలను ఎక్కువగా నమ్ముతారు కాబట్టి కాస్త ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం మోక్షజ్ఞ సినిమాల్లోకి అడుగు పెడితే అతని ఫ్యూచర్ బావుంటుందని భావించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మోక్షజ్ఞ గురించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ జూనియర్ బాలయ్య తండ్రికి తగ్గ కొడుకు అవ్వాలంటే ఆయన నుంచి అద్భుతమైన డైలాగ్ డెలివరీ, టైమింగ్‌ను నెటిజన్లు కోరుకుంటున్నారు అభిమానులు. ఇక ముఖ్యంగా డాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లలో మంచి పట్టు, డ్రెస్సింగ్, ప్రేక్షకుల్ని మెప్పించే నటన ఉంటే చాలు కచ్చితంగా స్టార్ హీరో అవ్వడం ఖాయం అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
హనుమంతుడు చెవిటివాడా..? వైరల్ అవుతున్న ఓమ్ రౌత్ ట్వీట్
కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి నాగబాబు గుండెను ముక్కలు చేసిన నిహారిక.. !