సినిమా అవకాశం కోసం వెళ్తే.. పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇటీవల కాలంలో చాలా మంది నటీనటులు, స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు తమకు ఎదురైన అనుభవాలు పంచుకుంటూ పలు ఆసక్తికర విషయాలను బయట పెడుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-04-24 07:02 GMT

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది నటీనటులు, స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు తమకు ఎదురైన అనుభవాలు పంచుకుంటూ పలు ఆసక్తికర విషయాలను బయట పెడుతున్న విషయం తెలిసిందే. కొంత మంది మాత్రం కాస్టింగ్ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు తెలుపుతూ.. ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన తన ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నే హత్వే అందరికీ సుపరిచితమే. ఆమె అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అన్నే నటించిన తాజా చిత్రం ‘ది ఐడియా ఆఫ్ యు’. ఈ మూవీ ఓటీటీలో మే 2 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అన్నే హత్వే ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమా అవకాశం కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. అయితే అప్పుడు సెట్‌లో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో టెస్ట్ చేయడానికి అక్కడికి వచ్చిన పది మంది అబ్బాయిలను ముద్దు పెట్టుకోమని నాకు చెప్పారు. కెమిస్ట్రీ ఎలా ఉంటుందో టెస్ట్ చేయడానికి నటీనటులను కలిసి నటించమని చెప్పడం కామన్.

కానీ పది మందిని ముద్దు పెట్టుకోమని చెప్పడం సరైన పద్ధతి కాదు. అదొక వరెస్ట్ ప్రాసెస్ అనిపించింది. కష్టమని చెప్పి వచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటే జీవితంలో ముందుకెళ్లలేమన్న ఆలోచనతో ఉండేదాన్ని. అందుకే వారు అలా చేయమని చెప్పినప్పుడు ఉత్సాహంగా ఉన్నట్లు యాక్టింగ్ చేశాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.

Tags:    

Similar News