నేను సీఎం అయితే అంటూ ఏపీ ఎన్నికల వేళ ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్.. వీడియో వైరల్..

కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. తల్లి, భార్యాకూతుళ్ల కన్నా తనను

Update: 2024-04-23 04:54 GMT

దిశ, సినిమా : కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. తల్లి, భార్యాకూతుళ్ల కన్నా తనను తాను ఎక్కువగా ప్రేమించుకునే ఆయన.. ఎవరి కోసమో నేనెందుకు త్యాగం చేయాలి అనే ఫిలాసఫితో బతికేస్తాడు. తన సంతోషమే తనకు ముఖ్యం అంటూ యంగ్ బ్యూటీస్‌తో టైం స్పెండ్ చేస్తాడు. నచ్చినట్లుగా మందేసి చిందేస్తుంటాడు. ఎవరేమనుకున్నా పర్లేదు అని తన లైఫ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఏ ఇంటర్వ్యూలోనైనా తన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చే వర్మ.. ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న వీడియోలోనూ అలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్సే చేశాడు.

హోస్ట్ అలి ‘సపోజ్ ఏపీ ప్రజలంతా కలిసి నిన్ను సీఎం చేస్తే నీ ఫీలింగ్ ఏంటి?’ అని ప్రశ్నించాడు. ‘నాకు అలాంటి పదవులు, బాధ్యతలు అంటే అసలు గిట్టదు. ఒకరికోసం నా టైమ్ నేనెందుకు వేస్ట్ చేయాలి. ఎవరి గురించో నేనెందుకు ఆలోచించాలి. నిజంగా సీఎం ఎలా పనిచేస్తాడో నాకు తెలియదు కానీ ఒకవేళ ఆ చాన్స్ వస్తే మాత్రం ప్రజల డబ్బు లాక్కుని, ఖజానా ఖాళీ చేసి విదేశాలకు చెక్కేస్తాను’ అని నిర్మొహమాటంగాగ చెప్పాడు ఆర్జీవీ. 

Full View

Tags:    

Similar News