మా ఆయన కంటే అది నేనే బాగా చేస్తా.. అనసూయ బోల్డ్ కామెంట్స్

హాట్ యాంకర్ అనసూయ తాజాగా ‘పెదకాపు 1’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2023-10-02 10:23 GMT

దిశ, సినిమా: హాట్ యాంకర్ అనసూయ తాజాగా ‘పెదకాపు 1’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ.. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ‘నాకు 40 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఎవరైనా, ఏదైనా ప్రశ్న అడగాలంటే అడగొచ్చు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులను కోరింది. ఈ క్రమంలో చాలామంది ఆమె నటించిన ‘పెదకాపు -1’ సినిమాలో అక్కమ్మ పాత్ర గురించి ప్రశ్నలు వేశారు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నించారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్ ‘మీ ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారు మీరా లేక మీ ఆయన?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి సమాధానం ఇచ్చిన అనసూయ ‘ఆ విషయంలో మా ఆయన కంటే నేనే బెస్ట్. నేను మా ఆయన కోసం ప్రేమగా వంట చేస్తా. ఆయన కూడా నా కోసం అప్పుడప్పుడు చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News