చరణ్ మూవీ లో చిన్న క్యారెక్టర్ అయినా చేస్తా : సూర్య

చిరు తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి తన అద్భుతమైన నటనతో తనకంటూ ఒక స్టాండ్ ని నిర్మించుకున్నాడు రామ్ చరణ్

Update: 2024-02-22 04:18 GMT

దిశ, సినిమా: చిరు తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి తన అద్భుతమైన నటనతో తనకంటూ ఒక స్టాండ్ ని నిర్మించుకున్నాడు రామ్ చరణ్. ‘RRR’ సినిమాతో ఒక ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య స్టార్ హీరోలు మరొక స్టార్ హీరోల మూవీస్ లో భాగం కావడం కామన్ అయిపోయింది. ఇందులో భాగంగా తాజాగా చరణ్ గురించి కోలీవుడ్ స్టార్ సూర్య వైరల్ కామెంట్స్ చేశాడు. ‘రామ్ చరణ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ‘రంగస్థలం’ సినిమాలో తన నటన చూసి ఫిదా అయిపోయా. చరణ్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ అయిన చేయడానికి నేను రెడీ గా ఉన్నాను’ అంటూ తెలిపాడు. తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తించబడుతున్న సూర్య ఇలా చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి.




Similar News