ఇండస్ట్రీలో ఎదగాలంటే వాళ్లతో డేటింగ్ చేయాలని చెప్పారు.. Nora Fatehi

బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహీ డేటింగ్, లవ్ ఎఫైర్లపై ఓపెన్ అయింది.

Update: 2023-07-31 12:13 GMT

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహీ డేటింగ్, లవ్ ఎఫైర్లపై ఓపెన్ అయింది. ఈ మేరకు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్టార్ నటులు లేదా గొప్ప పేరున్న వ్యక్తులతో డేటింగ్ చేస్తే తొరగా గుర్తింపు పొందుతామని చాలామంది చెప్పినట్లు తెలిపింది. అలాగే పబ్లిక్‌ రిలేషన్ కోసం కొంతమందిని సెలక్ట్ చేసుకుని వాళ్లతో ఈవెంట్లకు తిరగాలని సూచించినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నా సన్నిహితులే పలానా వ్యక్తులతో డేటింగ్ చేయమని చెప్పారు. కానీ, అలాంటి సూచనలను తాను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేనందుకు ఇప్పుడు సంతోషిస్తున్నా. అలా చేసివుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేను. ఇప్పుడు నా స్వంత నిబంధనల ప్రకారం విజయం సాధించానని గర్వంగా చెప్పగలను. నా సక్సెస్‌లో నా పక్కన మరొక వ్యక్తి లేదా ఏ స్టార్ హీరో లేడు’ అంటూ తాను సింగిల్‌గానే ఉన్నట్లు హింట్ ఇచ్చింది.

Full View

Also Read:  ఆ డైరెక్టర్ నన్ను లో దుస్తులు ధరించమన్నారు.. పవన్ కల్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ 

Tags:    

Similar News