జ్యోతిష్యుడి మాటలు విని నన్ను మూవీ నుంచి తొలగించారు : విజయ్ వర్మ

నటుడు విజయ్ వర్మ అంటే.. ఒకప్పుడు చాలామందికి తెలిసుండకపోవచ్చు.

Update: 2023-12-05 08:16 GMT

దిశ, సినిమా: నటుడు విజయ్ వర్మ అంటే.. ఒకప్పుడు చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే తమన్నాతో అతని లవ్ ట్రాక్ బయటపడిందో అప్పటి నుంచి మాత్రం అందరికీ సుపరిచితుడైపోయాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు, కేవలం తమన్నా ప్రియుడి‌గా మాత్రం ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న వర్మ తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చాడు. ‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాలీవుడ్‌లో నాకు ఎన్నో మూవీ ఆఫర్స్ వచ్చాయి. కానీ అవి తొందరగానే చేజారిపోయాయి. ఓసారి ఒక పెద్ద సినిమాలో మంచి అవకాశం వచ్చింది.

మేకర్స్ నావి కొన్ని ఫోటోలు పంపాలని చెబితే పంపించాను. కానీ కొద్ది రోజులకే నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. రీజన్ ఏంటంటే.. ఆ మూవీ తెరకెక్కించే డైరెక్టర్‌కు ఆయన జ్యోతిష్యుడు నన్ను మూవీ నుంచి తీసేయాలని చెప్పాడట. అందుకే తీసేశారు. ఎంతో బాధపడ్డాను. కానీ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నన్ను చాలా ఓదార్చారు. అతను ఆరోజు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేశాయి. నాకు ఎంతగానో ధైర్యాన్నిచ్చాయి. అతను చెప్పినట్లుగానే తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇష్టం లేకున్నా డబ్బుల కోసం చిన్న చిన్న పాత్రల్లో కూడా చేయాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ.

Tags:    

Similar News