ఆ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్దామనుకున్నా.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన గాయత్రి

టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Update: 2023-11-03 09:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఆర్జీవిపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను యాంక్లోసింగ్‌ స్పాండిలైటిస్‌ అనే వ్యాధి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ‍అయితే ఇది డిప్రెషన్‌ వల్ల వచ్చే శారీరక వ్యాధి అని ఈ విషయం నాకు ఆరు నెలల క్రితం తెలిసింది. చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారని తెలిపింది. అయితే సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చింది. సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నానని తెలిపింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఫ్లాట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాను భవతారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వికాస్, గాయత్రి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా, గాయత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. ‘‘ ఈ రోజు ఫ్లాట్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్దామనుకున్నా.. కానీ కుదరలేదు అంటూ ఏడుస్తూ కనిపించింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ఫ్లాట్ సినిమా చూడండి అంటూ అభిమానులను కోరింది. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు గాయత్రికి ఏమైందని కామెంట్లు చేస్తున్నారు. అలాగే కొందరు గెట్ వెల్ సూన్ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News