సెట్లో ఉన్నంతసేపు ఆ మూడ్‌లోనే ఉంటా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన శ్రీలీల
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ స్టార్ డమ్‌ను మరింత పెంచుకుంటోంది.
దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ స్టార్ డమ్‌ను మరింత పెంచుకుంటోంది. అయితే ఇటీవల శ్రీలీల నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా మహేష్ బాబు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం మూవీకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, వసూళ్ళ పరంగా పర్వాలేదు అనిపిస్తోంది. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఇండస్ట్రీకే దరిద్రం అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేశారు. అలాంటి వాటిని పట్టించుకోకుండా ఈ అమ్మడు ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేనెప్పుడూ స్విచ్చాన్, స్విచ్చాఫ్ పర్సన్ లా ఉంటాను. అది నా బలంగా ఫీలవుతున్నాను. ఒకేరోజు మూడు సినిమాల్లో మూడు క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినా, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి ఈజీగా ఒదిగిపోతాను. సెట్లో ఉన్నంత సేపు యాక్టింగ్ తప్ప మరో ధ్యాస ఉండదు. సెట్ నుంచి బయటకొచ్చానంటే సినిమా గురించి అస్సలు ఆలోచించను. సినిమాల్లోనే కాదు, చదువు విషయంలోనూ ఇలాగే ఉంటాను.. బుక్ పట్టుకుంటే నేను కచ్చితంగా చదవాలి అనే ఆలోచనతో ఉంటాను’’ అంటూ చెప్పుకొచ్చింది.