ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిన డైరెక్టర్ వేణు యెల్దండి.. కారణం ఏంటంటే?

వేణు యెల్దండి కమెడియన్‌‌గా జబర్థస్త్ షోతో పరిచయం అయ్యాడు. ఇటీవల బలగం సినిమాకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్‌గా ఓవర్ నైట్‌లో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.

Update: 2023-07-02 07:51 GMT

దిశ, వెబ్ డెస్క్: వేణు యెల్దండి కమెడియన్‌‌గా జబర్థస్త్ షోతో పరిచయం అయ్యాడు. ఇటీవల ‘బలగం’ సినిమాకు దర్శకత్వం వహించి ఓవర్ నైట్‌లో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రానికి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా, వేణు యెల్దండి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫస్ట్ లవ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.

వేణు మాట్లాడుతూ.. ‘‘ అందరిలానే నేను కూడా ప్రేమలో పడ్డాను. అయితే నేను ఆర్టిస్ట్ అయ్యాక ప్రేమలో పడటంతో నా రేంజ్ మారిపోతుంది అనుకున్నాను. ఇక అమ్మాయి చూడటానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వారి ఇంట్లోకి కూడా నన్ను రానిచ్చేవారు. దీంతో ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్లేవాడిని. ఇక ఆమెను పడేయడానికి ఎన్నో రకాల జోకులు వేసేవాడిని. ఇక నా బర్త్ డే కాకపోయినా కూడా అబద్ధం చెప్పి ఆమెని ఆమె ఫ్రెండ్‌ని తీసుకుని గోల్కొండ కోట అలాగే రోడ్‌లోని ఒక పెద్ద హోటల్లో డిన్నర్ ఇచ్చాను. అలాగే అలా వెళ్ళినప్పుడు ఆమెతో కొన్ని మాటలు కూడా కలిశాయి. చాలా హ్యాపీగా ఉన్నాను.

కానీ, ఇంటికి వచ్చి లెక్కలు వేసుకుంటే 30 వేల వరకు ఖర్చయ్యాయి. ఖర్చు విషయం పక్కన పెడితే ఒక అమ్మాయి కోసం ఇంత చేయడం అవసరమా.. నేను ఇండస్ట్రీకి రావడానికి నా అక్కలు ఎంత కష్టపడ్డారో నాకు గుర్తుకొచ్చింది. అలాంటిది ఈ అమ్మాయి కోసం ఇలా చేయడం ఎందుకు అని ఒక్కసారిగా నాకు జ్ఞానోదయం అయింది. దీంతో మా కుటుంబం మీద ఉన్న అతి ప్రేమతో ఆ అమ్మాయిని కుటుంబం ఒప్పుకోకపోతే ఎలా అని పక్కకు పెట్టాను. మా ఇంట్లో వాళ్ళు చూపించిన చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను’ అంటూ వేణు యెల్దండి చెప్పుకొచ్చాడు. అది తెలుసుకున్న నెటిజన్లు ఇంట్లో వాళ్ల కోసం ఓ అమ్మాయిని మోసం చేస్తావా అంటూ మండిపడుతున్నారు.


Similar News