‘సెక్స్ సింబల్’ ట్యాగ్ బాగా నచ్చింది.. నన్ను అలాగే పిలవండి
బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా తనను ‘సెక్స్ సింబల్’గా ట్రీట్ చేయడంపై మరోసారి తనదైన స్టైల్లో రియాక్ట్ అయింది.
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా తనను ‘సెక్స్ సింబల్’గా ట్రీట్ చేయడంపై మరోసారి తనదైన స్టైల్లో రియాక్ట్ అయింది. ఈ విషయంపై గతంలోనూ పలుసార్లు మాట్లాడిన నటి.. తాజాగా ఓ నేషనల్ చానల్ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. ‘‘సెక్స్ సింబల్’ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ‘ప్లెయిన్ జేన్(అట్రాక్టివ్ ఉమన్)’ అని పిలిపించుకోవడం కంటే ఇలాంటి పేరు తెచ్చుకోవడమే ఇష్టం. ఇలా గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ట్యాగ్ నాకు బాగా నచ్చింది’ అని చెప్పుకొచ్చింది. అలాగే ఈ సమావేశంలో ప్రియుడు అర్జున్ కపూర్‌తో తనకున్న అనుబంధం గురించి కూడా మలైక మాట్లాడింది.