రెండు నెలల్లో Prabhas పెళ్లి..! షాకింగ్ న్యూస్ లీక్ చేసిన Ram Charan
బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ పెళ్లి గురించిన వార్తలు ఎట్లయితే చక్కర్లు కొడుతుంటాయో.. టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి గురించి కూడా అదే జరుగుతోంది.
దిశ, సినిమా: బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ పెళ్లి గురించిన వార్తలు ఎట్లయితే చక్కర్లు కొడుతుంటాయో.. టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి గురించి కూడా అదే జరుగుతోంది. ఇటీవల బాలయ్యబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆహా మీడియాలో 'అన్ స్టాపబుల్ విత్ NBK 2'షో లో ప్రభాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ షోకి సంబంధించిన షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది. ఆ ఫోటోలు కూడా విడుదలయ్యాయి. ఎడిటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే శుక్రవారం నుంచి ఆహా మీడియాలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే షో లో రామ్‌చరణ్ వీడియో కాల్ ద్వారా ప్రభాస్‌ను పలకరించాడు. ఈ సందర్భంగా ప్రభాస్ సీక్రెట్‌ను చెప్పాలని బాలయ్య అడినప్పుడు, 'ప్రభాస్ పెళ్లి ఇంకో రెండు నెలల్లో జరగబోతోంది' అంటూ రాంచరణ్ ఆసక్తికరమైన విషయాన్ని లీక్ చేసినట్లు తెలిసింది.
Also Read....