నాకు అస్సలే ఆ హీరో నచ్చడంటున్న రాశిఖన్నా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రాశి ఖన్నా గురించి తెలిసిందే. ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

Update: 2024-03-01 15:27 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రాశి ఖన్నా గురించి తెలిసిందే. ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.అయితే కొందరు హీరోయిన్స్ హిట్స్ కొట్టి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం సినిమాలు హిట్టా ఫట్టా అని తేడా లేకుండా వరస సినిమాలతో దూసుకెళ్లి మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.అయితే వీరిలో ఒకరు ముద్దుగుమ్మ రాశి ఖన్న.ఈ అమ్మడు నటించిన మూవీస్ ఫ్లాప్ అయిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే. తన అందంతో, నటనతో ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటునే ఉంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో పలు మూవీలో నటించి అలరించింది.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారు హృదయాలను దోచేస్తుంది.తన ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్ లో ఎంతో మంది హీరోస్ తో నటించింది. అయితే ఈ అమ్మడు ఎవరి సరసన నటించిన ఆ హీరోస్ హిట్ కొట్టిన , ఫ్లాప్ అయినా పట్టించుకోలేదు. అందరితో ఈక్వల్ గా నటించింది.ఈ క్రమంలోనే తను సోషల్ వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. అది ఏంటంటే..ఒక తెలుగు హీరో తో నటించడం తనకు అసలే నచ్చలేదు అని చెప్పింది. టాలీవుడ్, బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ ఆ హీరోతో నటించాలని పోటీ పడుతుంటే రాశి ఖన్నా మాత్రం అసలు ఆ హీరోతో నటించడానికి ఇష్టపడట్లేదు.ఎందుకంటే ఆ హీరో ఈ బ్యూటీ బాడీ పై కామెంట్ చేశాడు అని తనపై మండిపడింది. అంతే కాదు ఎన్నో బడా సినిమాలో నటించిన ఆ హీరోతో నటించక పోవడం ఇష్టం లేదని చెప్పింది. తన బాడీ పై వల్గర్ గా కామెంట్ చేయడం తనకు నచ్చలేదని తను చెప్పడంతో ఈ న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Similar News