సమంతను పెళ్లి గెటప్‌లో చూసేసరికి ఏడ్చేశాను.. శోభిత ధూళిపాళ్ల పోస్ట్ వైరల్

యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల మొదట మిస్ ఇండియా కిరీటం గెలిచి ప్రజల మనసులు దోచేసింది.

Update: 2023-04-03 04:22 GMT

దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల మొదట మిస్ ఇండియా కిరీటం గెలిచి ప్రజల మనసులు దోచేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొంత కాలంగా శోభిత, అక్కినేని నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్నట్లు పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల లండన్‌లో వీరిద్దరూ కలిసి డేట్‌కు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, శోభిత ధూళిపాళ్ల ఓ పెళ్లికి హాజరైన ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘మెహందీ ఫంక్షన్‌.. ఎన్నో కొత్త ముఖాలు. ఎంతో ఆశ్చర్యంగా మరింత ఆనందంగా ఒకరినొకరు చూసుకుంటున్నాయి. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. నా ప్రాణ స్నేహితురాలు కూడా ఇంకా రెడీ అవకుండా నాకు తోడుగా ఉంది. నేను తారా ఖన్నా(శోభిత నటించిన మేడ్‌ ఇన్‌ హెవెన్‌ వెబ్‌ సిరీస్‌ పాత్ర) లా మారిపోయి.. ఏర్పాట్లన్ని దగ్గరుండి చూసుకున్నాను. అందుకే నేను రెడీ అవ్వడానికి టైం దొరకలేదు. కానీ, పెళ్లి మండపంలో మొదటిసారి సమంతను పెళ్లి కుమార్తెగా చూడగానే.. నాకు ఏడుపు ఆగలేదు. ఇక్కడ మెహందీ పెట్టడం వీలు కాలేదు. కానీ లంచ్‌ మాత్రం సూపర్‌గా ఉంది’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పెళ్లి తన ప్రాణ స్నేహితురాలిదని అర్థం అవుతుంది. కానీ ఆమె పేరు కూడా సమంత అవడంతో నెట్టింట శోభిత పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Also Read: పెళ్లైన హీరోను ఇష్టపడుతున్న సమంత.. ఎందుకంటే?

కర్మ ప్రకారమే ఇలా జరిగిందంటూ .. సమంతపై తమిళ నిర్మాత షాకింగ్‌ కామెంట్స్

Tags:    

Similar News