jyothi reddy: ఆ కుటుంబాన్ని నేను పోషిస్తున్న.. కానీ పెళ్ళికి నన్ను పిలవలేదు.. అనంత్- రాధిక పెళ్లిపై సీరియల్ నటి సంచలన వీడియో
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ముంబైలోని జియో కాన్వెంట్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ముంబైలోని జియో కాన్వెంట్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు సైతం హాజరయ్యారు. వారం రోజులకు పైగా జరిగిన ఈ వేడుకకు రూ. 5000 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.
ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి మహేష్ బాబు- నమ్రత, రామ్ చరణ్- ఉపాసన, దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీ ఇలా చాలా మంది హాజరయ్యారు. అయితే ఈ పెళ్ళికి నన్ను పిలవలేదని ఓ సీనియర్ నటి అసహనం వ్యక్తం చేస్తూ ఓ ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకీ ఆ నటి మరెవరో కాదండోయ్ జ్యోతి రెడ్డి. చాలా కాలంగా బుల్లితెరపై రాణిస్తూ.. ఎండమావులు, కార్తీక దీపం, రాధకు నీవే ప్రాణం, ప్రేమ ఎంత మధురం, మధురానగరిలో వంటి హిట్ సీరియల్స్‌లో నటించిన సీనియర్ నటి.
ఆమె మాట్లాడుతూ.. “నాకు ఎవరో మెసేజ్ పెట్టారు. అంబానీ ఫ్యామిలీ మిమ్మల్ని పెళ్ళికి పిలవలేదని మీకు కడుపు మంట అని... నాకు కడుపు మంటలు గిడుపు మంటలు ఏమీ లేవు కానీ... ఆ మెసేజ్ చూశాక నాకు ఓ ధర్మ సందేహం కలిగింది. 2018 నుండి నేను జియో వాడుతున్నాను. ప్రతి నెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నాను. నేను అంబానీ చుట్టాన్ని కాదా? జియో వాడేవారంతా అంబానీ చుట్టాలు కారా? ప్రపంచంలోని గొప్ప వాళ్ళందరినీ పెళ్లికి పిలిచారు. ఇన్ని సంవత్సరాల నుండి జియో వాడుతూ... మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని ఎందుకు పెళ్ళికి పిలవలేదు. ప్రతి నెలా జియో బిల్ క్రమం తప్పకుండా బిలు చెల్లిస్తున్నాను. చార్జీలు విపరీతంగా పెంచేశారు. ఒక నెల జియో ఫ్రీగా ఇవ్వొచ్చుగా. అదేమంటే చాలా మంది ఆర్టిస్టులను పోషించారు అంటున్నారు. ఎవరి డబ్బుతో ఎవరిని పోషించారు. ఏం మాట్లాడుతున్నారు మీరు” అంటూ జ్యోతి రెడ్డి సెటైరికల్ ఆన్సర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు సూపర్‌గా చెప్పారు మాడమ్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
(video link credits to jyothireddy instagram id)