దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా హాట్ కామెంట్స్ చేశాడు. ఓ సినిమాకు నో చెప్పలేనని, అందుకోసం త్యాగం చేయడానికి సిద్ధం అని చెప్పుకొచ్చాడు. దీంతో సినీ ప్రమికులు అతడిని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాల విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కావడం లేదు. సినిమాల మధ్య క్లాషేస్ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దిల్ రాజు దీనిపై స్పందించారు. ముఖ్యంగా మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' మార్చి 18కి లేదా ఏప్రిల్ 28కి విడుదల చేయాలని మూవీ మేకర్స్ చూస్తున్నారు.
ఈ సినిమా మళ్లీ విడుదలకు రెడీ అవడంతో ఆ డేట్స్‌లో ఉన్న సినిమాల వారు అయోమయంలో పడ్డారు. ఇప్పుడు సినిమాను వాయిదా వేయాలా, 'ఆర్ఆర్ఆర్'తో పోటీ పడాలా అని ఆలోచిస్తున్నారు. దీనిపై స్పందించిన దిల్ రాజు మాత్రం 'ఆర్ఆర్ఆర్' సినిమా మేకర్స్‌కు నో చెప్పలేనన్నాడు. వారు అడిగితే తన సినిమాల రిలీజ్ డేట్లను త్యాగం చేస్తానన్నాడు. అంతేకాకుండా నిర్మాతలందరవ ఈ విషయంపై సమావేశమవుతామని, రిలీజ్ డేట్ల విషయంలో క్లాషెస్ లేకుండా ఓ క్లారిటీకి వస్తామని చెప్పుకొచ్చాడు. ఇకనైనా సినిమాల విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.