Rashmika: వాళ్ల ప్రేమ లభించడం నా అదృష్టం.. రష్మిక పోస్ట్ వైరల్

నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రజెంట్ ‘పుష్ప 2’తో బిజీగా ఉంది.

Update: 2024-07-28 15:25 GMT

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రజెంట్ ‘పుష్ప 2’తో బిజీగా ఉంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ సందడి చేస్తుంది. ఇక సినిమాలతో కాకుండా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన మూవీ అప్‌డేట్స్‌తో పాటు.. పర్సనల్ విషయాలు కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు న్యూ లుక్‌లో కనిపించి వారిని మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ కేరళ వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ ఫొటోలను పంచుకుంటూ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.

‘జూలై 25 న, నేను కేరళలోని కరునాగపల్లికి వెళ్ళాను. అక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమకు ఆశ్చర్యపోయాను. నాకు ఆ ప్రేమ లభించడం నా అదృష్టం. మీరు అబ్బాయిలు చాలా ప్రియమైనవారు. ధన్యవాదాలు! నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నా పట్ల మీ శ్రద్ధను నేను ప్రేమిస్తున్నాను.. ధన్యవాదాలు.. ఈ ప్రేమను స్వీకరించడానికి నేను ఏమి చేశానో నాకు తెలియదు కానీ.. నేను నిజంగా ఆశీర్వదించబడ్డాను.. ధన్యవాదాలు.. నిజంగా కృతజ్ఞతలు’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News