ఆడవాళ్లకు మేలు చేసేందుకే ఈ సినిమా చేశా.. హ్యూమా ఖురేషి

బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి పితృస్వామ్య వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది. తను నటించిన ‘డబుల్ XL’ నవంబర్ 4న విడుదల కానుండగా

Update: 2022-10-15 13:45 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి పితృస్వామ్య వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది. తను నటించిన 'డబుల్ XL' నవంబర్ 4న విడుదల కానుండగా తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న నటి.. ఆడవాళ్ల అందంపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు మహిళలు నిర్దిష్ట బరువు, అందం, కలిగి ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తేనే అందరూ విశ్వసించేలా సమాజం షరతులు పెడుతుందన్న ఆమె.. అమ్మాయిలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెప్పింది.

'మనం ఈ ఆలోచనలను విడనాడాల్సిన సమయం వచ్చింది. నేను గ్లామర్ కలిగివున్నప్పటికీ పరిశ్రమలో బరువైన మహిళ లిస్ట్‌లో ఉన్నాను. అందుకే నేను పోషించిన క్యారెక్టర్ అమ్మాయిలకు సహాయపడుతుందని భావించాను. ఈ సినిమా చూసిన తర్వాత తమను తాము భిన్నంగా భావిస్తారు. మా కూతుళ్లను బలవంతం చేస్తున్నామా? హిజాబ్ ధరించమంటున్నామా? బికినీ వేసుకునేందుకు కండిషన్స్ పెడుతున్నామా? వంటి విషయాల్లో తల్లులు రియలైజ్ అవుతారు. సరదా కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాల ద్వారా సామాజిక మార్పు జరుగుతుందని బలంగా నమ్ముతున్నా' అంటూ పలు విషయాలు చర్చించింది.

Tags:    

Similar News