మరీ ఇంత హాట్ ఆ.. షర్ట్‌లెస్‌లో హృతిక్‌ను చూసి షాక్ అయిన ప్రియురాలు
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్.. మరోసారి షర్ట్ లెస్ టోన్డ్ ఫిజిక్ బాడీతో దర్శనమిచ్చి ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు.
దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్.. మరోసారి షర్ట్ లెస్ టోన్డ్ ఫిజిక్ బాడీతో దర్శనమిచ్చి ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు. తన ప్రియురాలు సబా ఆజాద్‌తో విదేశాల్లో ఎంజాయ్ చేసి ఇటీవలే ముంబైకి వచ్చిన ఆయన.. మళ్లీ పనిలో నిమగ్నమైనట్లు చెబుతూ నెట్టింట ఓ పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు అంతకుముందు ఆ తర్వాత అంటూ క్లీన్ షేవ్‌తో కనిపించిన హీరో రెడ్ క్యాప్ ధరించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న పిక్‌తోపాటు, గుబురు గడ్డంతో స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతున్న పాత ఫొటోను షేర్ చేశాడు.
అలాగే ఈ పోస్టుకు ‘సెలవు ముగిసింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్. జిమ్‌లో కలుద్దాం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతుండగా తన ప్రియురాలి సబా అజాద్ ‘ఈట్ మోర్ చీజ్ ప్లీజ్’ అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే ‘నమ్మలేకపోతున్నా’ నంటూ అనిల్ కపూర్ రియాక్ట్ కాగా.. ‘ఓహ్ సో హాట్. ఈ ప్రపంచంలో ఎవరూ మీ అంత హాట్‌గా ఉండలేరు’ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక హృతిక్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫైటర్’ 2024 జనవరి 25న విడుదలకానుంది.