Raj Tarun: ‘భలే ఉన్నాడే’ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే..?

‘భలే ఉన్నాడే’ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే

Update: 2024-09-15 04:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన మూవీ లేటెస్ట్ మూవీ ‘భలే ఉన్నాడే’. దర్శకుడు మారుతి టీం నుంచి వస్తున్న మూవీ సినిమా కావడంతో చాలా మంది ఈ మూవీ పై ఆసక్తి చూపించారు. ఈ టీం నుంచి ‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లిగోల 2’ వంటి వెబ్ సిరీస్…లు తెరకెక్కించిన శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేసిన తొలి మూవీ ఇది. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్స్..లో మారుతి మార్క్ కనిపించింది. ఈ సినిమాకి అన్నీ చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. కామెడీ, ఎమోషన్ బాగా వర్కౌట్ అయినట్టు అంతా చెప్పుకున్నారు. దీంతో ఫస్ట్ డే  కలెక్షన్స్ కూడా పర్వాలేదనిపించింది. ఒకసారి మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 0.18 CR

సీడెడ్ - 0.05 CR

ఉత్తరాంధ్ర - 0.08 CR

ఈస్ట్+వెస్ట్ - 0.04 CR

కృష్ణా+గుంటూరు - 0.06 CR

నెల్లూరు - 0.03 CR

ఏపి+తెలంగాణ - 0.44 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ - 0.06 CR

వరల్డ్ వైడ్(టోటల్) - 0.50 CR

‘భలే ఉన్నాడు’ మూవీకి రూ.1.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ మూవీకి రూ.0.50 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు వరకు వెళ్లాలంటే ఇంకా రూ.1.30 కోట్లను కలెక్ట్ చేయాలి.

Tags:    

Similar News