అవి నాకు కొత్తేమి కాదు.. హాట్ బ్యూటీ నిక్కీ తంబోలీ వైరల్ కామెంట్స్
‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ నిక్కీ తంబోలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ నిక్కీ తంబోలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ.. నెట్టింట తన అందాలతో రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ & సెక్సీ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిక్కీని ‘పోర్న్ స్టార్’ అంటూ నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేస్తారు కొందరు నెటిజన్లు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిక్కీ తనపై వచ్చే ట్రోల్స్ గురించి స్పందించింది.
‘‘మీరు నన్ను ఎలాగైనా పిలవండి. కానీ అవి నన్ను ఏ విధంగా దెబ్బతీయలేవు. నా జీవితంపై ఎలాంటి ప్రభావం చూపవు. కొంత మంది కేవలం ట్రోల్స్ చేసేందుకే వస్తారు. అలాంటి వ్యక్తులకు సమయాన్ని ఇవ్వడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. వాళ్ల ట్రోల్స్ నాకు కొత్తేమి కాదు. మనం ఎంత స్పందిస్తే.. వాళ్లు అంతకంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించి విమర్శలు చేస్తారు. నాపై ట్రోల్స్ చేస్తూ వాళ్లే ఏదో ఒకరోజు విసుగు చెందుతారు. కానీ.. నేను మాత్రం పట్టించుకోను’’ అంటూ చెప్పుకొచ్చింది.