మగాళ్లకు బోల్డ్ ఛాలెంజ్ విసిరిన హాట్ యాంకర్ అనసూయ.. మీరు అది చేయగలరా?
బుల్లితెర షోల్లో స్టేజ్ పై యాంకర్‌గా వ్యవహరించే అనసూయ ప్రస్తుతం సినిమాల్లో మెయిన్ రోల్ లో నటించే స్టేజ్‌కు వెళ్లింది.
దిశ, సినిమా: బుల్లితెర షోల్లో స్టేజ్ పై యాంకర్‌గా వ్యవహరించే అనసూయ ప్రస్తుతం సినిమాల్లో మెయిన్ రోల్ లో నటించే స్టేజ్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ భామ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 చిత్ర షూటింగ్లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అటూ సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ యాంకర్ మరో వైపు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.
తాజాగా ఈ హాట్ యాంకర్ మగాళ్లకు ఓ సవాల్ విసిరింది. మహిళలు చీరలు కట్టుకుని భారతీయ సంస్కృతిని కాపాడాలి అని అనుకునే మగ వారు.. పంచెలు, ధోతి వంటి సాంప్రదాయ దుస్తులు తప్పకుండా ధరించాలి. అని ఓ వ్యక్తి వీడియోలో చెబుతారు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. అనసూయ ‘మహిళల నుంచి సాంప్రదాయ కట్టు ఆశించే మగ వారు దీన్ని అనుసరించాలి. మీరు పంచెలు, ధోతి కట్టుకోగలరా? అంటూ సవాల్ విసిరింది. ప్రస్తుతం అనసూయ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.