Bramayugam: హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘భ్రమయుగం’ రిలీజ్ డేట్ ఫిక్స్ ..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. ప్రజంట్ 70+ ఏజ్ లోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్న

Update: 2024-01-28 05:20 GMT

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. ప్రజంట్ 70+ ఏజ్ లోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్న బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు లేటెస్టుగా ‘భ్రమయుగం’ అనే హారర్‌ థ్రిల్లర్‌ తో ఆడియన్స్ ను భయపెట్టడానికి రెడీ అయ్యారు. ‘భూతకాలం’ మూవీ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా లో అర్జున్ అశోకన్, సిద్దార్థ్‌, భరతన్, అమల్దా లిజ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. కాగా ఫిబ్రవరి 15న ఈ సినిమాను విడుదల కాబోతున్నట్లు మేకర్ తెలిపారు.

Tags:    

Similar News