Hit 3: ‘హిట్ 3’ అప్‌డేట్.. స్వయంగా నాని మాటల్లో..

టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌ ఫ్రాంచైజ్ ‘హిట్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Update: 2023-03-25 09:28 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌ ఫ్రాంచైజ్ ‘హిట్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ ‘హిట్’ హీరో కాగా.. సీక్వెల్‌లో అడివి శేషు కథానాయకుడిగా కనిపించాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా థర్డ్ పార్ట్ కూడా త్వరలో రానున్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్. పార్ట్ 2 క్లైమాక్స్‌లోనే నాని ఎంటరై, ఆయనే హీరో అని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇదే విషయంపై తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. ‘HIT 3’ స్టార్ట్ చేయడానికి కొంత సమయం పడుతుందన్నాడు. కాగా ప్రస్తుతం ‘దసరా’ ప్రమోషన్స్‌లో బిజిగా ఉన్నాడు హీరో.

Tags:    

Similar News