డిజిటల్ ప్రీమియర్‌గా 'Hit 2' .. సినిమా చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే..

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'హిట్ ది సెకండ్ కేస్'.

Update: 2023-01-03 12:04 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'హిట్ ది సెకండ్ కేస్'. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సూపర్ హిట్ మూవీ, డిసెంబర్ 2, 2022న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి 'హిట్' సినిమా హిట్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఒక వార్త అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదలకు ముందే సొంతం చేసుకుంది. కాగా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను జనవరి 6 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని చూడటానికి ఎవరైనా రూ. 129 అద్దె చెల్లించాలి.

ఇవి కూడా చదవండి : Twitter Account నిబంధనలు ఉల్లంఘించిన నటుడికి బిగ్ షాక్!

Tags:    

Similar News