హిందీ సినిమా తమను తాము బాలీవుడ్ అని పిలవడం మానేయాలి: మణిరత్నం

చిత్ర నిర్మాత మణిరత్నం బాలీవుడ్ పై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన CII దక్షిణ్ సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌‌లో మణిరత్నం పాల్గోన్నాడు.

Update: 2023-04-20 09:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర నిర్మాత మణిరత్నం బాలీవుడ్ పై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన CII దక్షిణ్ సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌‌లో మణిరత్నం పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "హిందీ సినిమా తమను తాము బాలీవుడ్ అని పిలవడం మానేయగలిగితే, ప్రజలు భారతీయ సినిమాను బాలీవుడ్‌గా గుర్తించడం మానేస్తారు" అని అన్నారు. తాను "వుడ్స్" అభిమానిని కాదని, వారు భారతీయ సినిమాను మొత్తంగా చూడాలని అన్నారు. అంటే ఆయా బాషాల చిత్రాలు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లుగా విడిపోవడం ఆయనకు నచ్చలేదని, అందరూ కలిసి ఒకే చిత్ర సీమ గా ఉండాలని మణిరత్నం భావించాడు.

Tags:    

Similar News