ఆ సీన్‌ చేస్తున్నపుడు మల్లిక టార్చర్ భరించలేకపోయా.. అలసిపోయినా వదల్లేదు

బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ యాక్టింగ్స్ స్కిల్స్‌పై నటుడు హిమాన్షు మాలిక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Update: 2023-06-17 13:17 GMT

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ యాక్టింగ్స్ స్కిల్స్‌పై నటుడు హిమాన్షు మాలిక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 2003లో గోవింద్ మీనన్ తెరకెక్కించిన ‘ఖ్వాహిష్’ సినిమా కోసం వీరిద్దరూ కలిసి పనిచేయగా.. ఇందులో మల్లిక పనితీరుతో తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. ‘‘ఖ్వాహిష్’లో మల్లికతో కలిసి పనిచేయడం సరదాగా అనిపించలేదు. ఇది ఆమె మొదటి ప్రధాన చిత్రం కాబట్టి చాలా ఆత్రుతగా కనిపించింది.

చిన్న చిన్న సన్నివేశాలు కూడా అనేక సార్లు చిత్రీకరించాల్సి వచ్చింది. తనకు చాలా రిహార్సల్స్ అవసరమని అర్థమైంది. అయినప్పటికీ అడ్జస్ట్ అయ్యాం. చివరకు కొన్ని సీన్లు చేయలేక ఆమె చాలా అలసిపోయింది. దీంతో మాకు టార్చర్‌గానే అనిపించింది’ అంటూ గత రోజులను గుర్తుచేసుకున్నాడు మాలిక్.

Tags:    

Similar News