Himaja: నన్ను దారుణంగా ఏడిపించారు.. ఇక ఎవడు చెప్పినా ఆగేది లేదు
ప్రముఖ టెలివిజన్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ హిమజ తన లైఫ్‌లో ఎదుర్కొన్న భయంకర విషయాలను బయటపెట్టింది.
దిశ, సినిమా : ప్రముఖ టెలివిజన్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ హిమజ తన లైఫ్‌లో ఎదుర్కొన్న భయంకర విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అందరిలాగే తాను పాజిటివ్, నెగిటివ్ కామెంట్లకు డిస్ట్రబ్ అయినట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. ‘నేను కూడా అందరిలానే లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొ్న్నా. అప్ అండ్ డౌన్స్ చూశాను. కొన్నిసార్లు ఘోరంగా ఏడ్చాను. సొసైటీ మనల్ని ఎలా చూస్తుంది? మనం కరెక్ట్‌గా ఉన్నామా? లేదా? అనేది మనకు తెలిసినట్లయితే.. మనం చేసే పని కరెక్ట్ పని అయినట్లయితే.. ఎవడు చెప్పినా ఆగేది లేదు. కాన్ఫిడెన్స్‌తో వెళ్లిపోవడమే. సోషల్ వర్క్ విషయంలోనూ బయటికి వెళ్లి ఏదో చేయాల్సిన దానికంటే.. మా ఇంట్లోనే, మా డ్రైవర్ పిల్లలను చదవించాల్సిన బాధ్యత నాపై ఉంది. ముందు నా సర్కిల్లో ఉన్న వారికి వీలైనంత హెల్ప్ చేసి, ఆ తర్వాత తెలియని వారి గురించి ఆలోచించాలని అనుకుంటున్నా. ఇక మనకు తెలిసో, తెలియకో ఏదో ఒక బ్యాడ్ జరుగుతూనే ఉంటుంది. అందుకే నెగిటివ్‌ని కూడా భరించే ఓపిక ఉండాలి. నేను చాలా బ్యాడ్ కామెంట్స్‌ని ఫేస్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read..
భారీ రెమ్యూనరేషన్ కోసం బెడ్ రూంలో బోల్డ్‌గా రెచ్చిపోయిన తమన్నా.. షాక్‌లో ఫ్యాన్స్!!