RGV వ్యూహం సినిమాపై హైకోర్టు ప్రత్యేక కమిటీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం చిత్రబృందం సమర్పించిన సెన్సార్ సర్టిఫికెట్లను పరిశీలించిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ఎవరు ఉండాలనేది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలకు నిర్ణయం ఏంటో చెప్పాలని ఆదేశించారు.
దీంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. కాగా, ఈ సినిమా గతేడాది డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉండగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం సినిమాను తెరకెక్కించారని లోకేష్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఈ తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.