విశాల్ సినిమాలపై బ్యాన్ విధించిన మద్రాస్ హైకోర్టు
ఈ మధ్యకాలంలో రాజకీయాలు, సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు హీరో విశాల్. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టు హీరోకు పెద్ద షాక్ ఇచ్చింది
దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో రాజకీయాలు, సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు హీరో విశాల్. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టు హీరోకు పెద్ద షాక్ ఇచ్చింది. విశాల్ సినిమాలపై బ్యాన్ విధించింది. విషయానికొస్తే.. అన్బు చెళియన్ అనే ఒక ఫైనాన్షియర్ వద్ద తన ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ కోసం రూ.21 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడట. ఈ అప్పు విషయంలో విశాల్ లైకా వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ‘విశాల్.. లైకాసంస్థకు ఆ డబ్బు చెల్లించేంతవరకు, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి వచ్చే సినిమా హక్కులు అన్ని లైకాకు చెందెలా ఉండాలని ఒప్పందం’ ప్రకారం లైకా వారు అప్పు తీర్చారు. కానీ, ఆ ఒప్పందాన్ని విశాల్ పట్టించుకోలేదు. దీంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు రూ.15 కోట్ల రూపాయలు వెంటనే లైకా పేరు మీద ఎఫ్‌డీ చేయాలని విశాలును ఆదేశించింది. అప్పటివరకూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి ఎలాంటి సినిమాలు థియేటర్లలో కానీ ఓటీటీల్లో కానీ విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: విక్రమ్ ‘తంగలాన్’ నుంచి బిగ్ అప్‌డేట్