అలాంటి సినిమాలు తీయడం నావల్ల అస్సలు కాదు.. తెగేసి చెప్పిసిన స్టార్ హీరోయిన్

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.

Update: 2024-01-23 09:12 GMT

దిశ, సినిమా: ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను. తర్వాత ‘రవితేజ, గోపీచంద్, ప్రభాస్, వెంకటేష్’ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇటు తెలుగు చిత్రాల్లో అలరిస్తూనే అటు తమిళ్, బాలీవుడ్ సినిమాల్లో తన సత్తా చాటింది. అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్‌ ఎంటో నిరూపించుకుంది. బాలీవుడ్‌లోఎంట్రీ ఇవ్వగానే ఈ తాప్సీకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పింక్. ఈ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ బీటౌన్‌లో వరుస ఆఫర్లు దక్కిచుకుంది.

ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయాలంటే ఫస్ట్ తాప్సీనే గర్తుచేసుకుంటారు అక్కడ. బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంటూ కూడా తాప్సీ టాలీవుడ్‌ సినిమాల్లో కూడా అలరిస్తుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తుంది. రీసెంట్‌గా ఈ అమ్మడు ‘డంకీ’ చిత్రంలో నటించి.. ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. గ్లామర్ విషయానికొస్తే.. తాప్సీ తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి.. యువతను ఆకట్టుకుంటుంది. కుర్రకారును టెంప్ట్ చేస్తూ స్టన్నింగ్ పొటోషూట్లు చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యాక్టర్ అయ్యాక డేట్ అనేది డిఫికల్టా అని మీడియా వారు ప్రశ్నించగా.. ‘నాకు అయితే తెలియదు కానీ.. మాథిస్ బోతో గత పది ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నాను. నేను 13 సంవత్సరాల క్రితమే యాక్టింగ్ స్టార్ చేశాను. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఏడాదిలోపే ఆయన్ను కలిశాను. డేటింగ్ కూడా మొదలుపెట్టారు. మాథిన్‌ను వదిలేయాలని కానీ.. మరో వ్యక్తితో ప్రేమలో పడాలన్న ఆలోచన మాత్రం నాకు లేదు. మా రిలేషన్ అంత స్ట్రాంగ్ గా ఉంది. మేం చాలా హ్యాపీగా ఉన్నాం.’ అంటూ వెల్లడించింది.

అలాగే యానిమల్ సినిమా గురించి ప్రస్తావన తీసుకురాగా.. అలాంటి సినిమాలో అయితే నేను నటించలేనని, ఇతరుల నటి నటీమణుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరికి నచ్చినట్లు వారు ఉండవచ్చు. ఎవరికీ నచ్చిన కంటెంట్ వారు ఎంపిక చేసుకుంటారు. నటీనటులందరికీ టాలెంట్ తో పాటు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటిని గౌరవిస్తూ నేను జీవితంలో ముందుకు సాగుతాను. వ్యక్తిగతంగా మాత్రం నేను అలాంటి సినిమాల్లో నటించలేను అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ఇక యానిమల్ చిత్రంలో మహిళల గౌరవాన్ని తగ్గించే సీన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే.


Similar News