నాగార్జున మేనకోడలి భర్తతో రొమాన్స్ చేసిన హీరోయిన్ శ్రియ.. కానీ తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చి అలా
ఏంటి నిజమా.. నాగార్జున మేనకోడలు సుప్రియ భర్తతో హీరోయిన్ శ్రీయా రొమాన్స్ చేసిందా.. ఈమె రొమాన్స్ చేశాక జరిగిన గొడవలు ఏంటి అని డౌట్‌గా ఉందా..
దిశ, సినిమా: ఏంటి నిజమా.. నాగార్జున మేనకోడలు సుప్రియ భర్తతో హీరోయిన్ శ్రీయా రొమాన్స్ చేసిందా.. ఈమె రొమాన్స్ చేశాక జరిగిన గొడవలు ఏంటి అని డౌట్‌గా ఉందా.. అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే నాగార్జున మేన కోడలు భర్తతో శ్రియ రొమాన్స్ చేసింది అంటే అది నిజ జీవితంలో కాదు సినీ లైఫ్‌లో. అసలు మ్యాటరేంటంటే..
నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ అందరికీ సుపరిచితమే.. ఈమె మొదట్లో హీరోయిన్గా నటించాలి అని పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ ఒక్క మూవీ తోనే ఆమె సరి పెట్టుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత హీరోయిన్ అవ్వాలనే కల పక్కన పెట్టేసి నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ బాధ్యతలు తీసుకుంది. ఇక ఆ మధ్యకాలంలో అడివి శేష్ హీరోగా చేసిన ‘క్షణం’ మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నటుడు చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉంటే అప్పట్లో హీరోయిన్ శ్రీయాతో కలిసి సుప్రియ భర్త చరణ్ రెడ్డి ‘ఇష్టం’ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కమర్షియల్‌గా హిట్ కాలేక పోయింది. ఇక ఈ మూవీ తర్వాత అనేక సినిమాలు చేస్తూ శ్రీయ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కానీ చరణ్ రెడ్డి మాత్రం మరో సినిమా చేయలేదు. ఇక సుప్రియ యార్లగడ్డ అతనికి ఎక్కడ పరిచయం అయిందో తెలియదు కానీ ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మూడునాళ్ళ ముచ్చట తీరకుండానే కొన్ని సంవత్సరాలకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించారు. ఇక ఈయన నాగార్జున మేనకోడలు భర్త అని అతను మరణించే వరకు ఎవరికీ తెలియదు. కాగా అలా సుప్రియ భర్తతో శ్రియ రొమాన్స్ చేసిందనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.